జగన్‌ను ఆశ్రయించిన దివ్యాంగులు.. చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు

దివ్యాంగుల రిజర్వేషన్లపై ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ.. జగన్‌ను ఆశ్రయించిన పరిశోధకులు

admin
By admin
1 Min Read
మాజీ ముఖ్యమంత్రి, Y. S. Jagan Mohan Reddy

తాడేపల్లి, మే 19: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఇటీవల విడుదలైన ఫ్యాకల్టీ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దివ్యాంగ పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు మాజీ ముఖ్యమంత్రి, Y. S. Jagan Mohan Reddy ను తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు.

ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ విభాగాల అధ్యక్షుడు డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని 19 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టులు కలిపి మొత్తం 1,523 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసిందని తెలిపారు. అయితే వీటిలో దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పిహెచ్‌డీలు పూర్తి చేసి ఉన్నత అర్హతలు సాధించిన దివ్యాంగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “దివ్యాంగుల హక్కుల చట్టం–2016”ను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. దీనివల్ల దివ్యాంగులకు ఉద్యోగాలు, జీవనోపాధి అవకాశాలు దూరమవుతున్నాయని తెలిపారు.

కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ నియామకాలలో కూడా దివ్యాంగులకు తగిన అవకాశాలు కల్పించడం లేదని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

వారి సమస్యలను ఓపికగా విన్న జగన్, దివ్యాంగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Share This Article
వ్యాఖ్యలు లేవు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి