కులగణనపై తెలంగాణకు సుప్రీంకోర్టు మద్దతు.. దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

కులగణనపై తెలంగాణ మోడల్‌కు సుప్రీంకోర్టు మద్దతు.. కేంద్రంపై సీఎం రేవంత్ డిమాండ్

admin
By admin
1 Min Read
Revanth reddy

A. Revanth Reddy జనగణనలో కులగణన చేర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దశ, దిశ చూపించే దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేర్చడాన్ని Supreme Court of India సమర్థించడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో తక్షణమే కులగణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించిందని గుర్తుచేశారు.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలపై కుల సర్వే నిర్వహించి పూర్తి వివరాలను ప్రజల ముందుంచామని సీఎం తెలిపారు. బలహీన వర్గాల్లో ఉన్న అభద్రతా భావాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నారు.

“ఇప్పుడు కులగణనను సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఇది మంచి పరిణామం. తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్లుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని గర్వంగా ఉందని తెలిపారు.

- Advertisement -
Share This Article
వ్యాఖ్యలు లేవు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి