ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్ ‘మన బూత్ – మన బాధ్యత’ కార్యక్రమం.. పాల్గొన్న కేటీఆర్

బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి: కేటీఆర్ డిమాండ్

admin
By admin
1 Min Read
KTR

ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే Sudheer Reddy ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన బూత్ – మన బాధ్యత’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao పాల్గొన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం మళ్లీ అభివృద్ధి దిశగా పయనించాలంటే K. Chandrashekar Rao నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల్లో హైదరాబాద్‌ను సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టిందని విమర్శించారు.

టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్, దీనికి నిరసనగా త్వరలో భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ స్థాయి నుంచే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అలాగే మహిళల భద్రత, న్యాయ వ్యవస్థపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

“బేటీ బచావో.. బేటీ పఢావో అని ప్రధానమంత్రి Narendra Modi అంటున్నారు. కానీ ఇవి కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారూ” అని అన్నారు.

“భారతదేశంలో బహుశా తొలిసారిగా ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీస్ జారీ చేసే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయకపోతే విచారణ నిష్పాక్షికంగా సాగే పరిస్థితి లేదని” వ్యాఖ్యానించారు.

అదే విధంగా Bandi Sanjay Kumar ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. “ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు, భారతదేశానికే అవమానకరం” అని కేటీఆర్ పేర్కొన్నారు.

Share This Article
వ్యాఖ్యలు లేవు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి