విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, ఉద్యోగం – పవన్ కళ్యాణ్

admin
By admin
1 Min Read
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, ఉద్యోగం – పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల చొప్పున తక్షణ సాయం అందించడంతో పాటు వారి వైద్య ఖర్చులన్నింటినీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే భరిస్తుందని తెలిపారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, స్టీల్ ప్లాంట్ 36 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ద్రవ ఉక్కును తరలించే ల్యాడిల్ బకెట్ పేలిపోవడం అత్యంత అరుదైన సంఘటనగా నిపుణులు పేర్కొంటున్నారని చెప్పారు.

ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం బొకారో స్టీల్ ప్లాంట్‌కు చెందిన త్రిసభ్య కమిటీని నియమించినట్లు వెల్లడించారు. సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, పాత యంత్రాల వినియోగం వంటి అన్ని అంశాలను కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని తెలిపారు.

కార్మికులు భద్రతా ప్రమాణాల అమలులో లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్న పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌లోని కార్మిక సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకేతిక ఇబ్బందులపై త్వరలో కార్మిక సంఘాలతో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

- Advertisement -

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేసిన ఆయన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

అనంతరం విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Share This Article
No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *