N. Chandrababu Naidu రాష్ట్రంలో పెరుగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలుల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎండల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపుపై సీఎం దృష్టి.. 2.50 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీకి ప్రణాళిక
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు చేపట్టాలని సీఎం N. Chandrababu Naidu అధికారులకు సూచించారు.
త్వరలో చేపట్టనున్న 2.50 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అటవీశాఖ అధికారులకు స్పష్టం చేశారు. జూన్ నెలలో సీడ్ బాల్స్ సిద్ధం చేసి, జూలై మరియు ఆగస్ట్ నెలల్లో విస్తృత స్థాయిలో పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు.


