పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయులందరికీ 7 కీలక విజ్ఞప్తులు చేశారు.
ఇది కేవలం మాటలు కాదు, ప్రతి పౌరుడి బాధ్యత!
ఆ 7 విజ్ఞప్తులు ఇవే:
- పెట్రోల్/డీజిల్ పొదుపు: అనవసర ప్రయాణాలు తగ్గించండి, ప్రజా రవాణా లేదా కార్పూలింగ్ ఉపయోగించండి.
- వర్క్ ఫ్రమ్ హోమ్: సాధ్యమైనంత వరకు ఇంటి నుండే పని చేస్తూ ఇంధనాన్ని ఆదా చేద్దాం.
- విదేశీ ప్రయాణాలు వద్దు: ఈ ఏడాదికి విదేశీ టూర్లు, వెడ్డింగ్ డెస్టినేషన్లు వాయిదా వేసుకుందాం.
- బంగారం కొనుగోలు నిలిపివేత: అత్యవసరం అయితే తప్ప ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేద్దాం.
- వంట నూనె వాడకం: ఆరోగ్యం కోసం, దేశం కోసం నూనె వాడకాన్ని 10% తగ్గించుకుందాం.
- సేంద్రియ సాగు: రసాయనిక ఎరువుల వాడకాన్ని 50% తగ్గించి, భూమిని కాపాడుకుందాం.
- ఓకల్ ఫర్ లోకల్: కేవలం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం.
ఎందుకు ఈ నిర్ణయం?
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన రూపాయి విలువ పడిపోకుండా ఉండాలంటే, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం మనందరి కర్తవ్యం.
భారత ఆర్థిక రక్షణ కవచంలో మీరు భాగస్వాములు అవ్వండి! ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి. 🙏
