ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన Yadadri Lakshmi Narasimha Swamy Temple దేవస్థానం పరిధిలో ఈ నెల 23న నిర్వహించనున్న ప్రతిష్టాత్మక వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి A. Revanth Reddy ను ఆహ్వానించారు.
దేవాదాయ శాఖ మంత్రి Konda Surekha, యాదగిరిగుట్ట దేవస్థాన అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేదాశీర్వచనం అందించగా, స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు Vem Narender Reddy, Chamala Kiran Kumar Reddy, ప్రభుత్వ విప్ Beerla Ilaiah, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
